జగన్ వాకిట్లో గంజాయి చెట్టు... ఏటిఎంగా ఎర్రచందనం..: వినూత్న ప్లకార్డులతో టిడిపి ఆందోళన

అమరావతి :  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రోజుకో సమస్యపై లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపడుతున్నారు.

| Updated : Sep 21 2022, 11:11 AM
Share this Video

అమరావతి :  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రోజుకో సమస్యపై లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపడుతున్నారు. ఇలా ఇవాళ(బుధవారం) వైసిపి నాయకులు రాష్ట్రంలోని సహజ వనరుల దోపీడీకి పాల్పడుతున్నారంటూ అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పీఎస్ వద్ద టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మూడేళ్ల వైసిపి పాలనలో సీఎం జగన్ ఒక్కరే రూ. 2 లక్షల కోట్ల దోపిడీ చేశారంటూ లోకేష్ ఆరోపించారు. అవినీతిలో ఏ1 జగన్ రెడ్డి అంటూ టిడిపి నాయకులు నినాదాలు చేసారు. ఇసుకను మింగేస్తున్న వైసీపీ ఇసుకాసురులు, జగన్ వాకిట్లో గంజాయి చెట్లు, సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ అంటూ వినూత్న నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ టిడిపి శాసనసభాపక్షం నిరసన చేపట్టింది.  

Related Video