జగన్ సర్కార్ పై ఆగ్రహం... మీసం తిప్పి తొడగొట్టిన యరపతినేని
గుంటూరు: వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహాకారంతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అణచి వేయాలని చూస్తోందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.
గుంటూరు: వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహాకారంతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అణచి వేయాలని చూస్తోందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఎంతలా అణచివేస్తే టిడిపి నాయకులు, కార్యకర్తలు అంతగా పైకి లేస్తామన్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయిని... వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.