పట్టాభీ ఆచూకీ కోసం ఇంటిముందే భార్య దీక్ష... ఫోన్ చేసి మాట్లాడిన రఘురామ...

గుంటూరు : గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి ఘటన తర్వాత తన భర్త కొమ్మారెడ్డి పట్టాభిరాం కనిపించడం లేదంటూ ఆయన భార్య చందన ఆందోళనకు దిగారు.

Share this Video

గుంటూరు : గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి ఘటన తర్వాత తన భర్త కొమ్మారెడ్డి పట్టాభిరాం కనిపించడం లేదంటూ ఆయన భార్య చందన ఆందోళనకు దిగారు. నిన్న(సోమవారం) సాయంత్రం అరెస్ట్ చేసిన తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు... ఆయనకు ఏదయినా హాని తలపెడితే సీఎం జగన్, డిజిపి బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. భర్త ఆచూకీ తెలపాలంటూ చందన డిజిపి ఇంటిముందు ధర్నాకు సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు... దీంతో తన ఇంటిముందే కుటుంబసభ్యులతో కలసి దీక్ష చేపట్టారు.

భర్త ఆఛూకీ కోసం ఆందోళన చేపడుతున్న చందనకు ఫోన్ చేసి పరామర్శించిన వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ధైర్యం చెప్పారు. ఏపీ నూతన గవర్నర్ నజీర్ ను కలిసి పరిస్థితిని వివరిస్తానని... అధైర్యపడొద్దని చందనకు భరోసా ఇచ్చారు రఘురామ. 

Related Video