పట్టపగలే నడిరోడ్డుపై టిడిపి నేత దారుణ హత్య... స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు
అమరావతి: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఉండవల్లిలోని తన నివాసం నుండి మాచర్లకు బయలుదేరారు. ఆయన భారీగా టిడిపి నాయకులు, కార్యకర్తలు మాచర్లకు బయలుదేరారు. మాచర్ల పరిధిలోని గుండ్లపాడు గ్రామ టిడిపి అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నడిరోడ్డుపై అతి దారుణంగా కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. ఇది వైసిపి రాజకీయ హత్యగా టిడిపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మృతుడు చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు స్వయంగా చంద్రబాబే గ్రామానికి బయలుదేరారు. దీంతో ఇప్పటికే ఉద్రిక్తంగా మారిన గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసారు.