టీడీపీ మాజీ కార్పొరేటర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... వైసీపీ గూండాల పనే అని ఆరోపిస్తున్న టీడీపీ

టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై పటమట లంకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 

First Published Sep 4, 2022, 11:44 AM IST | Last Updated Sep 4, 2022, 11:44 AM IST

టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై పటమట లంకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ గాంధీ ఒక కంటి చూపును పూర్తిగా కోల్పోయారు.  రాజకీయ కక్షపూరితంగానే ఈ దాడి జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆసుపత్రి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకొని నిరసన వ్యక్తం చేసారు. చికిత్సపొందుతున్న చెన్నుపాటి గాంధీని టీడీపి విజయవాడ ఎంపీ కేశినేని నాని , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరామర్శించారు.