ఒకేరోజు ఉమ బర్త్ డే , టిడిపి ఆవిర్భావ దినోత్సవం... గొల్లపూడిలో టిడిపి సంబరాలు

విజయవాడ : నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం... అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు పుట్టినరోజు కూడా.

| Updated : Mar 29 2023, 03:30 PM
Share this Video

విజయవాడ : నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం... అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు పుట్టినరోజు కూడా. దీంతో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో టిడిపి శ్రేణులు వేడుక జరుపుకున్నారు. గొల్లపూడిలోని వన్ టౌన్ సెంటర్లోని టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు దేవినేని ఉమ. అనంతరం పార్టీ నాయకులను  మాజీ మంత్రి సన్మానించారు.

ఇక దేవినేని ఉమ పుట్టినరోజును పురస్కరించుకుని  వేదపండితులు, పాస్టర్లు, ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేసి ఆయనను ఆశీర్వదించారు. నియోజకవర్గ నాయకులు టపాసులు కాలుస్తూ, బొకేలు, దండలతో ఉమకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 

Related Video