Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు... డిల్లీకి బయలుదేరిన వెయ్యిమంది కార్మికులు


విశాఖపట్నం: ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంగా వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో కార్మిక, ప్రజా సంఘాలు జాతీయ స్థాయిలో పోరాటానికి ఉద్యమానికి సిద్దమయ్యారు. 

First Published Aug 1, 2021, 10:59 AM IST | Last Updated Aug 1, 2021, 10:59 AM IST


విశాఖపట్నం: ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంగా వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో కార్మిక, ప్రజా సంఘాలు జాతీయ స్థాయిలో పోరాటానికి ఉద్యమానికి సిద్దమయ్యారు. ఇందుకోసం ఆగస్టు 2, 3 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే దాదాపు వెయ్యిమంది కార్మికులు విశాఖ రైల్వే స్టేషన్ నుండి డిల్లీకి బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియజేసేలా నిరసన తెలియజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఉక్క ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరనున్నారు.