Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైల మహాకుంభాభిషేక మహోత్సవానికి సీఎం జగన్ కి ప్రత్యేక ఆహ్వానం

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీశైలంలో జరగనున్న మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్ధానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి,  దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఈవో లవన్న, వేద పండితులు.  

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీశైలంలో జరగనున్న మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్ధానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి,  దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఈవో లవన్న, వేద పండితులు.  శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి 31 వరకు మహారుద్ర శతచండీ వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవం జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తీర్ధప్రసాదాలు అందజేసి వేదమంత్రాలతో వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు.