వీల్ చైర్లో ఓటేయడానికి... వృద్దురాలిని అభినందించిన ఎస్ఈసి నిమ్మగడ్డ

విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.

Share this Video

విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో మాట్లాడిన కమిషనర్ పోలింగ్ జరుగుతున్న తీరు, ఏర్పాట్లపై ఓటర్ల స్పందన తెలుసుకున్నారు. 

ఈ క్రమంలోనే 75 సంవత్సరాల టంకశాల సుబ్బమ్మ ఓటు వేయడానికి రావడం పట్ల రమేష్ కుమార్ ఆమెను అభినందించారు. ఆమెను ఆత్మీయంగా పలకరించిన నిమ్మగడ్డ సమాజానికి మీలాంటివారే స్ఫూర్తి అని అన్నారు. కమీషనర్ వెంట జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఉన్నారు.

Related Video