తిరుమల ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్... డివైడర్ ను ఢీకొన్న కారు

తిరుపతి : కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్న భక్తులు ప్రయాణిస్తున్న తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యింది.

Naresh Kumar | Updated : Nov 25 2022, 11:59 AM
Share this Video

తిరుపతి : కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్న భక్తులు ప్రయాణిస్తున్న తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యింది. వైజాగ్ చెందిన భక్తులు ఏడుకొండలపైకి మొదటి ఘాట్ రోడ్డు మీదుగా వెళుతుండగా మాల్వాడి గుండం వాటర్ ఫాల్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుండి భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. 

ఘాట్ రోడ్డుపై డివైడర్ ను ఢీకొన్న వెంటనే కారు ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం ధ్వంసమయ్యింది. టిటిడి అధికారులు ప్రమాదంపై సమచారం అందుకున్న వెంటనే ఘటనాస్ధలికి చేరుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తపడ్డారు. 
 

Related Video