Asianet News TeluguAsianet News Telugu

ఇంద్రకీలాద్రిపై నిలిచిన విద్యుత్ ... గాడాంధకారంలో దుర్గమ్మ సన్నిధి

విజయవాడ : దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోయే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బుధవారం కొద్దిసేపు గాఢాందకారంతో నిండిపోయింది.

First Published Oct 5, 2022, 10:24 AM IST | Last Updated Oct 5, 2022, 10:24 AM IST

విజయవాడ : దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోయే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బుధవారం కొద్దిసేపు గాఢాందకారంతో నిండిపోయింది. అధికారుల నిర్లక్ష్యమో లేక సాంకేతిక కారణమో తెలీదుగానీ ఇంద్రకీలాద్రిపై అర్ధరాత్రి దాదాపు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దుర్గమ్మ ఆలయ ప్రాంగణమంతా చీకట్లు కమ్ముకోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఇలా విద్యుత్ సరఫరా నిలిచిపోడానికి ఆలయ అధికారులే కారణమని విద్యుత్ అధికారులు తెలిపారు. తాము నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని.... ఆలయంవద్దే సమస్య తలెత్తినట్లు  పేర్కొన్నారు. ఇలా వైభవోపేతంగా సాగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లోనే అధికారుల తీరు ఇలావుంటే సాధారణ సమయాల్లో ఇంకెలా వుంటుందో అంటూ భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.