Bharat Bandh:జోరు వానలోనూ విజయవాడలో బంద్

విజయవాడ: గులాబ్ తుఫాను కారణంగా జోరున వాన కురుస్తున్న ఆంధ్ర ప్రదేశ్ లో బంద్ కొనసాగుతోంది.

Share this Video

విజయవాడ: గులాబ్ తుఫాను కారణంగా జోరున వాన కురుస్తున్న ఆంధ్ర ప్రదేశ్ లో బంద్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు నేడు భారత్ బంద్ (Bharat Bandh)కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ కు ఏపీ ప్రభుత్వం సహా కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలిపాయి. అయితే గులాబ్ తుఫాను ప్రభావంతో సోమవారం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరువానను సైతం లెక్కచేయకుండా విజయవాడలో వామపక్ష పార్టీల నాయకులు బంద్ లో పాల్గొన్నారు. గొడుగు పట్టుకుని వర్షంలోనే విజయవాడ బస్టాండ్ వద్దకు చేరుకున్న వివిధ పార్టీ నేతలు, కార్యకర్తలు రైతులకు మద్దతుగా బంద్ చేపట్టారు.

Related Video