విజయవాడ ఏసిబి కోర్టువద్ద ఉద్రిక్తత... టిడిపి నాయకులను అడ్డుకున్న పోలీసులు...

విజయవాడ : విజయవాడ ఏసిబి కోర్టువద్దకు టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

| Updated : Sep 10 2023, 12:41 PM
Share this Video

విజయవాడ : విజయవాడ ఏసిబి కోర్టువద్దకు టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు విజయవాడ ఏసిబి కోర్టులో హాజరుపర్చిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి ముందే ఊహించిన పోలీసులు కోర్టువద్ద భారీ భద్రత ఏర్పాటుచేసారు. టిడిపికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, టిడిపి కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.దీంతో టిడిపి నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేసారు. 

Read More

Related Video