బాబుకు షాకిచ్చిన పవన్: బీజేపీతో దోస్తీ
బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి అడుగులు వేసేందుకు సిద్దమయ్యారు.
బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి అడుగులు వేసేందుకు సిద్దమయ్యారు. ఇవాళ న్యూడిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు ఆర్ఎస్ఎస్ పెద్దలతో సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ నడ్డాతో భేటీ అయ్యారు.ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సోమవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ సమస్యలపై చర్చించారు. మూడు నెలల తర్వాత ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు.ఆందోళనలు చేస్తున్న మహిళలపై పోలీసుల తీరుపై మీడియాలో వచ్చిన వార్తలను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొంది. మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై ఏం చర్యలు తీసుకొన్నారని హైకోర్టు ప్రశ్నించింది.ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది.మార్చ్‌ఫాస్ట్, 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్టు సీరియస్ అయింది.