గన్నవరం విమానాశ్రయంలో నూతన టోల్ గేట్ విధానం..
కృష్ణాజిల్లా : గన్నవరం విమానాశ్రయంలో నూతన టోల్ గేట్ విధానం ప్రారంభమయ్యింది.
కృష్ణాజిల్లా : గన్నవరం విమానాశ్రయంలో నూతన టోల్ గేట్ విధానం ప్రారంభమయ్యింది. దీనిమీద ఫాస్ట్ టాగ్ నిర్వాహకుడు లక్షమోజీ మాట్లాడుతూ..విమానాశ్రయానికి వచ్చే వాహనాలకు ఫాస్ట్ టాగ్ విధానంలో చెల్లింపు విధానం ప్రారంభించాం. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోనే తొలిసారి గన్నవరం విమానాశ్రయంలో ప్రారంభించడం జరిగింది. గన్నవరం విమానాశ్రయంలో విమానాలు రద్దీ పెరిగిన క్రమంలో నూతన విధానం అమలుకు శ్రీకారం చుట్టాం. టోల్ గేట్ వద్ద ప్రయాణీకుల వాహనాలు రద్దీ తగ్గించేందుకు నూతన విధానం అమలులోకి తెచ్చాం. ఒమెక్రాన్ బిఎఫ్ 7 హెచ్చరికతో క్యాష్ లెస్ విధానం అమలు చేస్తున్నాం. ఈవిధానం వల్ల ప్రయాణీకులకు సమయం ఆదా అవుతుందని తెలిపారు.