Asianet News TeluguAsianet News Telugu
breaking news image

పోలీసులమంటూ ఇంట్లో చొరబడి... మైనర్ బాలిక కిడ్నాప్

నెల్లూరు: గత శనివారం కిడ్నాప్ గురయిన మైనర్ బాలికను సురక్షితంగా కాపాడారు నెల్లూరు పోలీసులు.

నెల్లూరు: గత శనివారం కిడ్నాప్ గురయిన మైనర్ బాలికను సురక్షితంగా కాపాడారు నెల్లూరు పోలీసులు. బాలికను విజయవాడలో దాచినట్లు గుర్తించిన పోలీసులు కిడ్నాపర్ల చెరనుండి ఆమెను విడిపించారు. ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ కు సంబంధించిన వివరాలను రూరల్ డీఎస్పీ  హరినాథ్ రెడ్డి వెల్లడించారు. గత నెల 30వ తేదీ అర్ధరాత్రి బుచ్చిరెడ్డిపాలెం మండలం  జొన్నవాడ గ్రామానికి మద్దెల క్రుష్ణవేణమ్మ ఇంట్లోకి పోలీసులమంటూ ప్రవేశించిన ఇద్దరు ఆమె మనవరాలి(14ఏళ్ల బాలిక)ని కిడ్నాప్ చేశారని డిఎస్పి తెలిపారు. క్రుష్ణవేణమ్మ ఫిర్యాదు మేరకు బాలిక కోసం గాలించి కిడ్నాపర్లు భాగ్యలక్ష్మి, అల్తాఫ్ నుండి సురక్షితంగా కాపాడినట్లు డిఎస్పి తెలిపారు. ఈ కేసును కేవలం రెండు రోజుల్లోనే ఛేదించిన పోలీసులను  డీఎస్పీ  హరినాథ్ రెడ్డి అభినందించారు.