గాయత్రీదేవి అలంకరణలో విజయవాడ దుర్గమ్మ... దర్శించుకున్న మంత్రి కారుమూరి

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నేడు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.

| Updated : Sep 28 2022, 03:18 PM
Share this Video

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నేడు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికి దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన దేవాదాయ అధికారులను, జిల్లా యంత్రాగాన్ని మంత్రి అభినందించారు.దర్శనం అనంతరం మంత్రి కారుమూరి మాట్లాడుతూ... ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై ఆ అమ్మవారి దీవెనలు వుండాలని... రాష్ట్రం సుభిక్షంగా వుండాలని కోరుకున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ మరిన్ని మంచిపనులు చేసేలా ఆశీర్వదించాలని కోరానన్నారు. ఇక ప్రజలకు మంచిచేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను నిత్యం విమర్శించే ప్రతిపక్షాలకు మంచి బుద్దిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నానని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. 

Related Video