Asianet News TeluguAsianet News Telugu

బీచ్ ఐటి డెస్టినేషన్ గా విశాఖ... సీఎం జగన్ కీలక నిర్ణయం : మంత్రి అమర్నాథ్

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్దికి వైసిపి ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 

First Published Dec 29, 2022, 9:58 AM IST | Last Updated Dec 29, 2022, 9:58 AM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్దికి వైసిపి ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 2023 లో విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మాదిరిగానే ఏపీలో ఐటీ అభివృద్దికి అన్ని అవకాశాలున్న  నగరం విశాఖపట్నమేనని మంత్రి అన్నారు. అందువల్లే విశాఖను బీచ్ ఐటి డెస్టినేషన్ గా అభివృద్ది చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని అన్నారు. ఇప్పటికే ఐటీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు విశాఖ వేదికగా జరుగుతున్నాయని... వచ్చేఏడాది గ్లోబల్ టెక్ సమ్మిట్ కూడా ఇక్కడే  జరగనుందని అన్నారు. ఇన్ఫోసిస్, అమెజాన్, ఐబిఎం లాంటి కంపనీలు విశాఖకు వస్తున్నాయని... వీటి రాకతో రాష్ట్ర ఐటీ ముఖచిత్రమే మారుతుందని మంత్రి అమర్నాథ్ అభిప్రాయపడ్డారు.