Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ గెలిచి చూపిస్తా... లేదంటే రాజకీయాలే వదిలేస్తా..: మేకపాటి సవాల్

నెల్లూరు : మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. 

First Published Mar 28, 2023, 5:28 PM IST | Last Updated Mar 28, 2023, 5:28 PM IST

నెల్లూరు : మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని... ఒకవేళ గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. నువ్వు గెలవకుంటే రాకీయాల నుండి తప్పుకుంటావా? సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు. నేనొక్కడినే కాదు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గెలవడంం ఖాయమని... ఇతరుల గురించి కాకుండా నీ గురించి ఆలోచించుకో అని సవాల్ విసిరారు. సింగిల్ డిజిట్ తో గెలిచిన అనిల్ 35 వేలమెజార్టీతో గెలిచిన నా గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మేకపాటి అన్నారు.