అక్రమ మద్యం దందా... మైలవరం వైసిపి సోషల్ మీడియా కో-కన్వీనర్ అరెస్ట్

మైలవరం : ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మకాలు చేపడుతున్న మైలవరం నియోజకవర్గ వైసిపి సోషల్ మీడియా కో కన్వీనర్ పజ్జూరు శ్రీకాంత్ ను ఎక్సైజ్ విజిలెన్స్ పోలీసులు అరెస్ట్ చేసారు.

Share this Video

మైలవరం : ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మకాలు చేపడుతున్న మైలవరం నియోజకవర్గ వైసిపి సోషల్ మీడియా కో కన్వీనర్ పజ్జూరు శ్రీకాంత్ ను ఎక్సైజ్ విజిలెన్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులోని ఓ వైన్ షాప్ లో పనిచేసే శ్రీకాంత్ అధికార వైసిపిలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అయితే అధికార పార్టీ అండతో శ్రీకాంత్ వైన్ షాప్ మూసివేసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్దంగా అధికధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో అతడి కదలికలపై నిఘా వుంచిన ఎక్సైజ్ విజిలెన్స్ పోలీసులు ఉండ్రకుంట నాగరాజు అనే వ్యక్తికి అధిక ధరకు 65 మద్యం బాటిల్లు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీకాంత్ తో పాటు నాగరాజును మైలవరం ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. 

Related Video