పంచాయితీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం..: అంగన్వాడి కార్యకర్తల హెచ్చరిక
తమ ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయటంతో పాటు వివిధ డిమాండ్లతో మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద అంగన్ వాడీ కార్యకర్తలు మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు.
తమ ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయటంతో పాటు వివిధ డిమాండ్లతో మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద అంగన్ వాడీ కార్యకర్తలు మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా నలుమూలల నుండి కలెక్టరేట్ వద్దకు వేలాదిగా చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తమకు అమ్మఒడి డబ్బులు బ్యాంకుల్లో పడితే తిరిగి చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇలాగే తమను వేధిస్తే పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో అంగన్ వాడి కేంద్రాలకు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.ఈ డిమాండ్లు పరిష్కారం కాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామమని హెచ్చరించారు.