కొడాలి నాని ఆపరేషన్ సక్సెస్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే: అంబటి రాంబాబు

Share this Video

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె సమస్యతో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చేరారు. తొలుత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. అయితే, ఆపరేషన్ అవసరం కావడంతో హైదరాబాద్ నుంచి ముంబయి తరలించారు. దీంతో కొడాలి నాని ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. ముంబై ఆస్పత్రిలో కొడాలి నానికి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.

Related Video