ఆంధ్రా యూనివర్సిటీలో గోహత్య... గోపూజతో జనసేన నిరసన
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన గో హత్య రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది.
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన గో హత్య రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే యూనివర్సిటీ ప్రాంగణంలో గోవు మృతిపై వస్తున్న ఆరోపణలపై ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ నియమించారు వి.సి ప్రసాద రెడ్డి. అయినప్పటికి జనసేన పార్టీ నిరసన కొనసాగిస్తోంది. సోమవారం గోహత్యకు నిరసనగా ఏయూ గేటువద్ద గోపూజా కార్యక్రమాన్ని చేపట్టారు జనసేన నాయకులు.