జనసేన టీడీపీ పొత్తుపై జగన్ వ్యంగ్యాస్త్రాలు...పొత్తులు పెట్టుకోవడం విడిపోవడం మాత్రమే తెలుసంటూ సెటైర్లు...

బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులు రూ.231 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌ విడుదల చేశారు.

Share this Video

బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులు రూ.231 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌ విడుదల చేశారు. బటన్‌ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భం గా ప్రసంగిస్తూ తాను ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ప్రజల తరపున నిలబడ్డా, వారికి ఎంతో మంచి చేస్తున్నా అని తోడుగా నిలవమని ప్రజలకు విజ్ఞప్తి చేసారు..అదే సందర్భం గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు, వారే పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లే.. వివాహాలు చేసునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే..అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు..

Related Video