అసెంబ్లీ సమావేశాలను ఈసారి కూడా బహిష్కరిస్తున్నారా? జగన్ రియాక్షన్ ఇదే | Asianet News Telugu
అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరిస్తున్నామనే దానికన్నా స్పీకర్‌ను ఈ ప్రశ్న అడిగితే బాగుంటుందన్నారు. ఈ విషయంలో స్పీకర్ రెస్పాండ్ కావాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఆయన రెస్పాండ్ అయి సమాధానం చెప్పాలన్నారు.