Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. పేషంట్ల మధ్యే కరోనా మృతదేహం.. పత్తాలేని ఆస్పత్రి సిబ్బంది..

విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. 

First Published Jul 22, 2020, 10:47 AM IST | Last Updated Jul 22, 2020, 11:09 AM IST

విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అయితే అతని మృతదేహాన్ని పేషంట్ల మధ్యే ఉంచేయడం.. చుట్టూ బాధితులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. హాస్పిటల్ లో సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. కంచరపాలెంకు చెందిన ఒక 65 యేళ్ల వ్యక్తి  కరోనా లక్షణాలతో శుక్రవారం నగరంలోని పలు ఆస్పత్రులకు తిరిగినా, బెడ్స్ కాళీ లేవంటూ తిరిగి వెనక్కి పంపించారు. దీంతో శుక్రవారం అర్థరాత్రి  ప్రభుత్వ అంటు వ్యాధుల ఆసుపత్రిలో( చెస్ట్ ఆసుపత్రి) చేర్చారు.  దీనితో అక్కడ డాక్టర్లు ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతదేహాన్ని బంధువులకు ఇవ్వక, అక్కడినుండి తరలించకపోవడంతో రోగులు భయాందోళనలకు గురవుతున్నారు.