పల్నాడు జిల్లా గురజాలలో జోరుగా గుట్కాదందా...

పల్నాడు జిల్లా : గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో జోరుగా గుట్కాదందా ఆగడం లేదు.

First Published Sep 14, 2022, 1:43 PM IST | Last Updated Sep 14, 2022, 1:43 PM IST

పల్నాడు జిల్లా : గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో జోరుగా గుట్కాదందా ఆగడం లేదు. పోలీసులు దాడులు చేస్తున్నా, తనిఖీలు చేస్తున్నా, ఎక్కడికక్కడ గ్రామాలతో పాటు... సందు, గొందుల్లో వ్యాపారం జరుగుతుంది. బస్సులు, పాల వ్యానులు, ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరవేసి గురజాల నియోజకవర్గ కేంద్రాలను కలుపుతూ, మండల కేంద్రాలకు, గ్రామీణ ప్రాంతాలకు యథేచ్ఛగా తరలించి విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఆర్డర్లను బట్టి సప్లై జరుగుతుంటుంది. ఈ అక్రమ వ్యాపారనికి అడ్డుకట్ట వేయాలని అరెస్టు చేసి పిడి యాక్ట్ లు నమోదు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ నవరత్నాలు పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రత్నాలన్ని రాలిపోయాయని ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో మద్యం, గుట్కా, గంజాయి లాంటివి ఏరులై పారుతున్నాయన్నారు.