కందుకూరు దుర్ఘటనకు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే కారణం..: హోంమంత్రి వనిత

అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చివల్లే నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిదిమంది ప్రాణాలు బలయ్యాయని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.

Chaitanya Kiran  | Published: Dec 29, 2022, 4:09 PM IST

అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చివల్లే నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిదిమంది ప్రాణాలు బలయ్యాయని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకోవాలనే ఇరుకు సందుల్లో అదీ రాత్రిపూట సభ పెట్టడమే ప్రమాదానికి కారణమయ్యారు. ఈ చావులకు చంద్రబాబే బాధ్యత వహించాలని హోంమంత్రి వనిత డిమాండ్ చేసారు. కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తానేటి వనిత ప్రగాడ సానుభూతి తెలిపారు. కందుకూరు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారని... ఇంతమంది మృతికి కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వనిత తెలిపారు. 

Read More...