ట్రాఫిక్ చక్రవ్యూహంలో దాచేపల్లి.. ఆంధ్రా- తెలంగాణ సరిహద్దుల్లో ప్రమాదాలు...

దాచేపల్లిలో ఆంధ్ర- తెలంగాణ కృష్ణానది సరిహద్దున ఉన్న పొందుగల, తంగెడ రెండు సరిహద్దుల్లో నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది.

First Published Mar 24, 2022, 10:37 AM IST | Last Updated Mar 24, 2022, 10:37 AM IST

దాచేపల్లిలో ఆంధ్ర- తెలంగాణ కృష్ణానది సరిహద్దున ఉన్న పొందుగల, తంగెడ రెండు సరిహద్దుల్లో నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. దీంతో  అద్దంకి నార్కెట్పల్లి హైవే ప్రమాదాలకు అడ్డాగా మారింది. ప్రతిరోజు నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ లో వాహనచోదకులు ప్రాణాలు వదులుతున్నారు.

దాచేపల్లి పట్టణంలో తంగెడ రోడ్డు వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ సైడ్ వాల్ ముందుకు రావడంతో తెలంగాణ నుండి దాచేపల్లి వైపుగా వచ్చే సిమెంట్ లోడ్ లారీలు దాచేపల్లి లో నేషనల్ హైవే ఎక్కాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేషనల్ హైవే పై ఎలాంటి బారికేడ్లు నిర్మించకపోవడంతో తరచూ ఏదో ఒక యాక్సిడెంట్ లతో తంగెడ రోడ్డు యాక్సిడెంట్లు అడ్డాగా మారింది.

ఒకవైపు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పొందుగుల వైపునుండి హైవేపై వేగంగా వస్తున్న వాహనాలు, మరోవైపు ఆంధ్ర తెలంగాణకు మరో సరిహద్దుగా కృష్ణానది అవతల తెలంగాణ సిమెంట్ ఫ్యాక్టరీ లోడ్ లారీల ఉధృతితో తంగెడ రోడ్డు ప్రాణ సంకటంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి దాచేపల్లి సరిహద్దులు పొందుగల, తంగెడ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.