ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరదనీరు... 30గేట్లెత్తి దిగువకు నీటి విడుదల
విజయవాడ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విజయవాడ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదనీరు చేరడంతో నదులు, వాగులు వంకలు పొంగిపొర్లడంతో పాటు చెరువులు, నీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఇలా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇన్ ప్లో 26,848 క్యూసెక్కులు కాగా 4,948 క్యూసెక్కుల నీటిని కాలువలకు, మిగతా 21,900 క్యూసెక్కుల సర్ ప్లస్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజి 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి ఈ నీటిని వదులుతున్నారు అధికారులు.