వైజాగ్ టు చెన్నై వయా గుంటూరు... వేల కిలోల్లో గంజాయి పట్టివేత
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా గంజాయి పట్టుబడింది.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి ఛైన్నైకి ఓ వాహనంలో గంజాయిని తరలిస్తుండగా గుంటూరు జిల్లా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. ఇలా పట్టుబడిన గంజాయి 1000కేజీల నుంచి 1200కేజీల వరకు ఉంటుందని అంచనా. అక్రమంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.