బలపం పట్టాల్సిన చేతులతో పార పట్టించి... విద్యార్థులను కూలీలుగా మార్చిన ఉపాధ్యాయుడు

ఏలూరు : పలకాబలపం పట్టాల్సిన చేతులతో పలుగు పార పట్టించాడో కసాయి టీచర్. విద్యాబుద్దులు నేర్పాల్పిన వాడు డబ్బుల కోసం విద్యార్థులకు కూలీ పనులు చేయిస్తూ బుద్దితక్కువగా వ్యవహరించాడు.

First Published Dec 28, 2022, 10:44 AM IST | Last Updated Dec 28, 2022, 10:44 AM IST

ఏలూరు : పలకాబలపం పట్టాల్సిన చేతులతో పలుగు పార పట్టించాడో కసాయి టీచర్. విద్యాబుద్దులు నేర్పాల్పిన వాడు డబ్బుల కోసం విద్యార్థులకు కూలీ పనులు చేయిస్తూ బుద్దితక్కువగా వ్యవహరించాడు. చివరకు బాత్రూంలలో పనులు సైతం విద్యార్థులతో చేయిస్తూ అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. ఇలా ప్రభుత్వం ఇచ్చే వేలకు వేలు జీతం చాలక నిరుపేద విద్యార్థుల కడుపుకొట్టి బియ్యాన్ని కూడా పందికొక్కులా దోచేస్తున్నాడు సదరు ఉపాధ్యాయుడు. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో వెలుగుచూసింది. లక్కవరం మండల పరిషత్ పాఠశాలలో నాడు-నేడు కింద అభివృద్ది పనులు చేపట్టింది జగన్ సర్కార్. అయితే ప్రభుత్వ నుండి వచ్చే నిధులను జేబులో వేసుకుని పాఠశాల విద్యార్థులతో కూలీపనులు చేయిస్తూ అడ్డంగా దొరికిపోయాడో ఉపాధ్యాయుడు. ఇప్పటికే విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఉపాధ్యాయుడికి పలుమార్లు గ్రామస్తులు వార్నింగ్ ఇచ్చినా అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు. మరోసారి చదువుకోడానికి వచ్చిన చిన్నారులతో పారపట్టించి మట్టిపనులు చేయిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. అంతేకాదు విద్యార్థుల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం బస్తాలను సైతం సదరు టీచర్ దోచుకున్నాడని లక్కవరం వాసులు ఆరోపిస్తున్నారు. ఇలా డబ్బుల కోసం ఎంతకంటే అంతకు దిగజారిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను లక్కవరం గ్రామస్తులు కోరుతున్నారు.