Asianet News TeluguAsianet News Telugu

రెడ్ క్రాస్ పై ఏపీ గవర్నర్ ప్రశంసల జల్లు.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిష్వ భూషన్ హరి చందన్, ఇండియన్ రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి హోదాలో జిల్లా కలెక్టర్లు, జిల్లా యూనిట్ అధికారులతో రాజ్ భవన్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

First Published Jun 3, 2020, 5:49 PM IST | Last Updated Jun 3, 2020, 5:49 PM IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిష్వ భూషన్ హరి చందన్, ఇండియన్ రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి హోదాలో జిల్లా కలెక్టర్లు, జిల్లా యూనిట్ అధికారులతో రాజ్ భవన్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెడ్ క్రాస్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రెడ్ క్రాస్ రాష్ట్ర మరియు జిల్లాల లోని శాఖలు చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలను మరింత చైతన్య పరచవలసినదిగా గవర్నర్ శ్రీ హరి చందన్ జిల్లా కలెక్టర్లను, రెడ్ క్రాస్ జిల్లా అధికారులను కోరారు.  వలస కార్మికుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ కోరారు.