Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్‌ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్.. (వీడియో)

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ అయ్యారు.

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ అయ్యారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి.. సోదాలు కూడా నిర్వహించారు. అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి విజయవాడకు ఏసీబీ అధికారులు తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ కూడా రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తోంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఏపీ ఈఎస్‌ఐలో భారీ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓ నివేదికను బయటపెట్టింది. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందట. ఈఎస్ఐ డైరెక్టర్లు రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. మొత్తం రూ.988 కోట్లకు సంబంధించి రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగిందని గుర్తించారు.