ఏపీలో భూకంపం... ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో భయం భయం

గుంటూరు : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇవాళ ఉదయం(ఆదివారం) భూకంపం సంభవించింది. 

Share this Video

గుంటూరు : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇవాళ ఉదయం(ఆదివారం) భూకంపం సంభవించింది. గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్ పరిసరాల్లో భూమి ప్రకంపనలకు గురవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పల్నాడు ప్రాంతంలోని అచ్చంపేట మండలం చల్లగరిగ, మాదిపాడు, పులిచింతల గ్రామాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లోనూ భూమి కంపించినట్లు సమాచారం. ఈ భూప్రకంపనలతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

Related Video