నేడు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ

విజయవాడ : దసరా శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.

First Published Sep 28, 2022, 11:50 AM IST | Last Updated Sep 28, 2022, 11:50 AM IST

విజయవాడ : దసరా శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇలా నవరాత్రి వేడుకల్లో మూడోరోజయిన ఇవాళ(బుధవారం) దుర్గమ్మ గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం, అల్లపుగారెలు నివేదన చేయనున్నారు.
 గాయత్రీ దేవి అవతారంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంద్రకీలాద్రిపై బారులుతీరారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, టిడిపి నేత గొట్టిపాటి రామకృష్ణ తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఆలయానికి మరిన్ని బస్సులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున అందించనున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు.