ఏపీకి టోపీ పెట్టిన కేంద్ర బడ్జెట్ 2023-24 : తులసి రెడ్డి ఆందోళన

అమరావతి :  బడ్జెట్ 2023-24 లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి టోపీ పెట్టిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. తులసి రెడ్డి అన్నారు.

First Published Feb 2, 2023, 1:18 PM IST | Last Updated Feb 2, 2023, 1:18 PM IST

అమరావతి :  బడ్జెట్ 2023-24 లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి టోపీ పెట్టిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. తులసి రెడ్డి అన్నారు. రైతులు, గ్రామీణ ప్రజలు, పేదలు, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్ ఇదంటూ ఎద్దేవా చేసారు. 70 శాతం దేశ జనాభా ఆదారపడ్డ వ్యవసాయానికి ఈ బడ్జెట్ లో కేవలం 2.77శాతం నిధులు మాత్రమే కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. గ్రామీణాభివృద్ది, ఆహార సబ్సిడీపై కోత విధించడం,నిరుద్యోగుల ప్రస్తావనే లేకపోవడం దారుణమన్నారు. ఇక బడ్జెట్ 2023 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని తులసిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేదని... పోలవరం ప్రాజెక్ట్ ను పట్టించుకోలేదని తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు.