హర్యానా సీఎం ఖట్టర్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ
విశాఖపట్నం: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నం రుషికొండలోని ఫెమ వెల్ నెస్ రిసార్టులో నేచురోపతి చికిత్స తీసుకుంటున్నారు హర్యానా సీఎం. దీంతో హర్యానా సీఎంను కలిసేందుకే ప్రత్యేకంగా విశాఖకు చేరుకున్నారు జగన్. ఖట్టర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ఇద్దరు సీఎంలు కాస్సేపు భేటీ అయ్యారు.