పోలవరం పనులపై జగన్ ఆరా: ఏరియల్ సర్వే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ సర్వే ద్వారా శుక్రవారం నాడు పరిశీలించారు. 

Share this Video

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ సర్వే ద్వారా శుక్రవారం నాడు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులు సీఎం కి వివరించారు . ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం హోదాలో జగన్ పోలవరం సందర్శించడం రెండొవసారి .పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు హెలిప్యాడ్‌ వద్ద మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్ని నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, , తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీఎస్ నాయుడు,ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్‌, కలెక్టర్‌ ముత్యాల రాజు స్వాగతం పలికారు. 

Related Video