వైసీపీకి పనులు చేయొద్దు.. అలాచేస్తే పాముకు పాలుపోసినట్లే: CM Chandrababu | Asianet News Telugu
తెలుగుదేశం నాయకులు సోషల్ మీడియాను విరివిగా వాడుకోవాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నాయకులు బాగా పనిచేయిస్తున్నారని అభినందించారు. అయితే, వైఎస్సార్సీపీకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పనులు చేయొద్దని స్పష్టం చేశారు. అలా చేస్తే పాముకు పాలు పోసినట్లేనన్నారు.