
Chalo Vijayawada:నూజివీడులోనే బస్సు, ఆటో సర్వీసుల నిలిపివేస్తున్న పోలీసులు... ప్రయాణికుల కష్టాలివే...
విజయవాడ: పీఆర్సిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ: పీఆర్సిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను విజయవాడకు వెళ్లనివ్వకుండా నూజివీడులో బస్సులు, ఆటోలను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడకు వెళ్లే వాహనాలను నిలిపివేయడంలో ఆసుపత్రికి వెళ్లేందుకు వచ్చిన పలువురు పేషెంట్లు నూజీవీడులోనే ఇబ్బందులకు గురయ్యారు.
ఇక ఉద్యోగులు ఎలాగోలా విజయవాడ వరకు చేరుకున్నా నగరంలోకి వేళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇలా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులలో వచ్చిన ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.
వారధి వద్ద 25మంది ఉద్యోగుల ను గుర్తించిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.