ఇక సజ్జలలు, కమిటీలతో కాదు... నేరుగా సీఎం జగన్ తోనే..: ఉద్యోగ సంఘాల నేతల ప్రకటన

విజయవాడ: పీఆర్సీని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతమయ్యిందని ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. 

Share this Video

విజయవాడ: పీఆర్సీని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతమయ్యిందని ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. పోలీసుల పహారా, నిర్భందం ఉన్నా ఇక్కడికి వచ్చిన ఉద్యోగులు తమ పక్షాన పోరాడాలని తేల్చి చెప్పారని పీఆర్సీ సాధన సమితి నాయకులు సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇకపై చర్చలకు సజ్జల లాంటి మధ్యవర్తులు వద్దని... సీఎం జగనే ప్రత్యక్షంగా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని సూర్యనారాయణ కోరారు. మరో ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు కూడా ఇకపై ఏ కమిటీతోనూ చర్చించబోమని... సీఎంతోనే చర్చిస్తామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడే ఉద్యోగుల ఉద్యమం విజయవంతం అయ్యిందని... ఉద్యోగులు చేతకాని వారని భావించిన ప్రభుత్వంలోని కొందరికి గుణపాఠం చెప్పామని బొప్పరాజు అన్నారు.

Related Video