Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ ఆటోను ఢీ కొన్న కారు.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు...

గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్లోబల్ స్కూల్ వద్ద పిల్లల ఆటోని కారు ఢీకొట్టింది. 

Sep 23, 2022, 12:28 PM IST

గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్లోబల్ స్కూల్ వద్ద పిల్లల ఆటోని కారు ఢీకొట్టింది. దీంతో  ఆటో రోడ్డుపై నుండి కందకంలో పల్టీ కొట్టి పడిపోయింది. ఆటోలోని విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను పోలీసులు తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదంలో  5 గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరంతా..మందడం హైస్కూల్  విద్యార్థులుగా గుర్తించారు. ఆటోను ఢీ కొన్న కారు ప్రముఖ ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో పనిచేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆటో వెంకటపాలెం నుండి మందడం హైస్కూల్ కి వచ్చే మార్గం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.