9 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్... ఇదీ ఏపీలో పరిస్థితి : సిపిఐ రామకృష్ణ
అమరావతి : వైసిపి ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ రివర్స్ లో నడిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేసారు.
అమరావతి : వైసిపి ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ రివర్స్ లో నడిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేసారు. నాడు నేడు అంటూ జగన్ సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది... మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది? అని ప్రశ్నించారు. 9 నెలల్లోనే 6.41 లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్ళిపోతుంటే చోద్యం చూసుకుంటూ ఎందుకు కూర్చున్నారంటూ ప్రశ్నించారు. దాదాపు 9 వేల పాఠశాలల్లో ఒక్క టీచర్ మాత్రమే పనిచేస్తున్నారంటూ రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత అధ్వాన్నంగా వుందో అర్థమవుతుందని అన్నారు. విద్యారంగాన్ని నాశనం చేసే కుట్రతో వైసిపి ప్రభుత్వం పాలన సాగిస్తోందని సిపిఐ రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేసారు.