Asianet News TeluguAsianet News Telugu

ఈడీ విచారణకు రాహుల్ గాంధీ... విశాఖలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడి) విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నారు. 

First Published Jun 13, 2022, 3:33 PM IST | Last Updated Jun 13, 2022, 3:33 PM IST

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడి) విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లోని విశాకపట్నంలో ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఈడీ కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ... మోడీ సర్కార్‌ రాజకీయంగా కక్షగట్టి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. చట్టబద్ద సంస్థలను కక్షపూరిత రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను ప్రత్యర్ధులపైకి ఊసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు భారత దేశ అధికారుల్లా కాకుండా భారతీయ జనతా పార్టీఅధికారుల్లా వ్యవహరిస్తున్నారని శైలజానాథ్ ఎద్దేవా చేసారు.