జగనన్న విదేశీ విద్యా దీవెన ... బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్

అమరావతి : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే పేద విద్యార్థుల కలలను నిజం చేసేందుకు వైసిపి సర్కార్ 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పేరుతో బృహత్తర పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. 

First Published Feb 3, 2023, 4:48 PM IST | Last Updated Feb 3, 2023, 4:48 PM IST

అమరావతి : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే పేద విద్యార్థుల కలలను నిజం చేసేందుకు వైసిపి సర్కార్ 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పేరుతో బృహత్తర పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటాతో పాటు అగ్రవర్ణ పేద విద్యార్థులు కూడా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా, ఏ టాప్ యూనివర్సిటీలో అయినా చదువుకునే అవకాశాన్ని జగన్ సర్కారే కల్పిస్తోంది. ఇలా ఈ పథకం కింద ఇప్పటివరకు 213 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లగా... వీరికి  మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమచేసారు.