AP Budget: ఏపీలో పిల్లలను చదువులకు దూరం చేసే కుట్ర: వైఎస్ జగన్ | Asianet News Telugu
సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేద పిల్లల చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన నిధులు కూడా విడుదల చేయడం లేదన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్... మార్చి 12న ప్రతి జిల్లా కేంద్రంలో వైసీపీ తరఫున కలెక్టర్లకు విజ్నాపన పత్రాలు అందిస్తామని తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని పోరాటం చేస్తామన్నారు.