Travel Sickness: మీకు ప్రయాణంలో వాంతులు అవుతాయా? తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా? ఎలాంటి ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ప్రయాణం హాయిగా సాగుతుంది.   

మనలో చాలా మందికి ప్రయాణం అంటే చాలు వాంతుల ఫోబియో ఉంటుంది. నాకు కారు పడదు. బస్సు ఎక్కితే చాలు వాంతులు అయిపోతాయి అంటుంటారు. దీనికి రెమెడీగా చాలా మంది నిమ్మకాయను దగ్గర పెట్టుకొని వాసన చూస్తుంటారు. ఇది పని చేస్తుంది. దీంతో పాటు ఎలాంటి ఖర్చు లేని ఈ టిప్స్ ఫాలో అయితే బస్సు, కారు, బైక్ ఏ ప్రయాణంలో అయినా వాంతులు, తలతిరుగడం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 

1. తేలికగా తినండి

ప్రయాణానికి ముందు, ప్రయాణంలో ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ వద్దు. ఇడ్లీ, దోశ, పెరుగు అన్నం, పండ్లు లాంటివి తినండి. కడుపు బరువుగా ఉంటే వాంతులు, మైకము వచ్చే అవకాశం ఉంటుంది.

2. నీళ్ళు ఎక్కువగా తాగండి

ప్రయాణంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. టీ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం కూడా తాగొచ్చు. నీళ్ళు తక్కువగా తాగితే మైకము వస్తుంది.

3. గాలి తగిలేలా చూసుకోండి

వెహికల్ లో కిటికీలు తెరిచి గాలి పీల్చుకోండి. వాంతులు తగ్గుతాయి. ఏసీ లేని వెహికల్స్ లో ఇది చాలా ముఖ్యం. బస్సులో, కార్లో వెళ్తున్నప్పుడు ముఖం మీద గాలి తగిలేలా చూసుకోండి.

4. ముందుకే చూడండి

వెహికల్ వెళ్తున్న దిశలోనే చూస్తూ ఉండండి. తలతిరుగుడు తగ్గుతుంది. పక్కలకి, వెనక్కి చూడకండి. పుస్తకాలు చదవడం, మొబైల్ చూడటం వల్ల కూడా కొంతమందికి తలతిరుగుతుంది.

5. అల్లం, నిమ్మకాయ

అల్లం, నిమ్మకాయ వాంతులు తగ్గిస్తాయి. ప్రయాణంలో చిన్న అల్లం ముక్క బుగ్గన పెట్టుకొని తింటూ ఉండండి. నిమ్మరసం నీళ్ళలో కలిపి తాగినా మంచి రిజల్ట్ ఉంటుంది. అల్లం మిఠాయిలు కూడా వాంతులు రాకుండా ఉపయోగపడుతుంది. 

6. సరిగ్గా నిద్రపోండి

ప్రయాణానికి ముందు రాత్రి బాగా నిద్రపోండి. అలసట తగ్గితే వాంతులు, మైకము తగ్గుతాయి. బాగా రెస్ట్ తీసుకుంటే ప్రయాణం హాయిగా ఉంటుంది.

7. మందులు

మీకు ఈ ప్రాబ్లెమ్ ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. డాక్టర్ ఇచ్చిన మందులు ప్రయాణంలో ఉపయోగపడతాయి. లాంగ్ జర్నీస్ కి ఇది చాలా ముఖ్యం.