MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Travel
  • సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?

సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?

రైల్వే శాఖ సీనియర్ సిటిజన్స్ కి, దివ్యాంగులకు ఎన్నో సౌకర్యాలు అందిస్తోంది. వాటిల్లో ముఖ్యమైన 5 ఫెసిలిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి సౌకర్యాలు రైల్వే శాఖ కల్పిస్తోందని చాలా మందికి తెలియకపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 17 2025, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రైలు రవాణా వెన్నెముక లాంటిది. ముఖ్యంగా  దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే తక్కువ ఖర్చులో సౌకర్యవంతంగా, అలసట లేకుండా ప్రయాణించడానికి రైలు ప్రయాణం బెస్ట్ ఛాయిస్. అందుకే రైళ్లలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. రైళ్లే శాఖకు కూడా నిత్యం వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అందుకే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే అనేక రాయితీలను కూడా అందిస్తోంది. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు అందించే 5 ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

1. లోయర్ బెర్త్ సౌకర్యం

60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలకు రైలులో మొదటి ప్రాధాన్యంగా లోయర్ బెర్త్ సౌకర్యాన్ని అందిస్తోంది. స్లీపర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ బోగీలలో ఈ సౌకర్యం లభిస్తుంది. రైలు బయలుదేరిన తర్వాత కూడా కింది సీట్లు ఖాళీగా ఉంటే అవి సీనియర్ సిటిజన్లకు కేటాయిస్తారు.

2. వీల్ చైర్ సౌకర్యం

రైల్వే స్టేషన్లలో ఉచిత వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయి. నడవడానికి ఇబ్బంది పడే వృద్ధులకు ఈ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది. వీల్ చైర్లతో పాటు సహాయకులైన పోర్టర్లు కూడా ఉంటారు. వారి సహాయం కూడా ఉచితంగా తీసుకోవచ్చు.

34

3. ప్రత్యేక టికెట్ కౌంటర్లు

వృద్ధులు, దివ్యాంగులైన ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటి వల్ల క్యూలలో వేచి ఉండి టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. త్వరగా టికెట్లను పొందవచ్చు.

4. బ్యాటరీతో నడిచే వాహనాలు

పెద్ద రైల్వే స్టేషన్లలో వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువగా నడవవలసిన అవసరం ఉండదు. అక్కడ బ్యాటరీతో నడిచే వాహనాలు (గోల్ఫ్ కార్ట్‌లు) ఉచితంగా అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ప్రవేశ ద్వారం వరకు బ్యాటరీ కార్ల ద్వారా వృద్ధులు, దివ్యాంగులను ఉచితంగా తీసుకెళ్తారు.

44

5. లోకల్ ట్రైన్స్ లో ప్రత్యేక సీట్లు

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లోని సబర్బన్ లోకల్ ట్రైన్స్‌లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లు కేటాయిస్తారు. ప్రయాణంలో వారు నిలబడకుండా సౌకర్యవంతమైన సీటులో కూర్చుని ప్రయాణించవచ్చు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
ట్రెక్కింగ్ ఇష్టమా.. హిమాలయాలోని ఈ సీక్రెట్ స్పాట్స్ కు వెళ్లండి!
Related Stories
Recommended image1
Train Ticket: ట్రైన్ టికెట్‌ చిరిగిపోతే ప్రయాణం చేయొచ్చా? కొత్త టికెట్ కొనాలా? అధికారుల వివరణ ఇదే
Recommended image2
హై స్పీడ్ డేటా అందించే టాప్‌ నెట్వర్క్ అదే.. మరి మీ సెల్‌ఫోన్‌లో ఆ సిమ్ ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved