Tirumala: పవిత్ర భాద్రపద మాసం, వరుస సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అయితే, భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామనీ, వారి రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం అలిపిరి ట్రెక్కింగ్ మార్గంలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసిన తర్వాత 12 ఏళ్ల లోపు పిల్లల ట్రెక్కింగ్ కు టీటీడీ అనుమతి నిలిపివేసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు.